రండి, విప్లవం సృష్టిద్దాం !

ప్రపంచం లోని భాషల్లో చాల భాషలు localization పరం గా చాలా అభివృద్ధి చెంది ఉన్నాయి. ఏ విధం గా అభివృద్ది చెంది ఉన్నాయంటే : operating system interfaces అన్ని ఆయా భాషల్లో అనువదించబడ్డాయి. అలాగే internet లో ఉన్న విశేషాలు, సంగతులు, వార్తలు, బ్లాగులు ఇవి వెతకడానికి ప్రతి భాషకి చక్కగా పనిచేసే search engine లు ఉన్నాయి. కాని తెలుగు కి మాత్రం ఈ లోపం స్పష్టం గా కనపడుతోంది. అలగే మిత్రులతోనూ, బంధువులతోను chatting చేసుకొనేటప్పుడు చక్కటి తెలుగు పదాల్ని times new roman script లో type చేసుకోవాల్సిన దుర్దశ తెలుగు భాష కు పట్టింది. తెలుగు wikipedia కూడా చాలీ చాలని articles తో జీవితం నెట్టుకొస్తోంది. చాలా  మంది bloggers కి తెలుగు లో రాసే సత్తా ఉంది. కాని ఎందుకు రాయలేకపోతున్నారు. ఈ దుర్దశ నుండి తెలుగు భాషను మనం ఎలా బయట పడేయగలమన్నది చాల మందిని వేదిస్తోన్న ప్రశ్న.

ఇప్పుడిదంతా చెప్పడంలో నా ఉద్దేశం తెలుగు లోని english పదాల్ని వాడడం మానెయ్యాలని, లేక మన operating system లు అన్ని తెలుగు లోనే వాడాలని కాదు. అది అవివేకం అవుతుంది, మొదటి కే మోసం అవుతుంది. తెలుగు లో blog చెయ్యమని ప్రోత్సహించనా నా మాట వినే వాళ్ళు ఎక్కువ ఉండరు.

internet లో తెలుగు భాష వైభవం మనకి కనపడకపోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనం ఎవరం తెలుగు keyboard లు వాడం గనుక. ఇంకో కారణం ఏంటంటే ప్రస్తుతం ఉన్న transliteration tools లో type చేయడమంటే నల్లేరు పై నడకే. ఈ విషయాన్ని మీకు స్పష్టం గా ఈ video లో చూపిస్తాను.

ప్రస్తుతమున్న tools లో మీరు తెలుగు వ్రాయాలంటే కొన్ని నిబంధనలు ప్రకారమే రాయాలి. ఇష్టం వచినట్లు రాస్తే మీరు రాసినది తప్పుల తడక అవుతుంది. ఉదాహరణకి ఒక అచ్చును సాగదియాలంటే capital letter రాయాలి. ఇవన్ని చేస్తూ కూర్చుంటే తెల్లవారిపోతుంది. అందువలన తెలుగు లో వ్రాసే ఆసక్తి చాలా మందికి కలుగకుండా పోతుంది.

కానీ తెలుగు భాష చరిత్రలో ఒక విప్లవాత్మకమైన మార్పు ని తీసుకు వచ్చే అవకాసం google మనకి ఈవేళ ఇచ్చింది.
మానమ computer లో తెలుగు వాడే విధానాన్ని ‘google transliteration IME’అనే ఒక tool శాస్వతం గా మర్చివేయబోతోంది. ఈ  tool ని మనం install చేసుకున్నట్లయితే మనం ఏ application లోనైన దీనిని వాడుకొనే అవకాసం మనకు లభిస్తుంది. ఈ tool ని ఎలా వాడలో, ఎలా install చెయ్యాలో మీకు ఈ వీడియో లో స్పష్టం గా చూపిస్తాను.

తెలుగు భాషను ప్రోత్సహించడం లో మీరు చేసే ఉడత సాయం బ్రహ్మాండమైన మేలు చేస్తుందని మీకు గుర్తు చేస్తున్నాను. అందుకని నేను మనవి చేసేది ఏంటంటే సాటి తెలుగు వారి తో chatting చేసేటప్పుడు తెలుగు లోనే మాట్లాడండి. ఈ tool కొన్ని తప్పులు చెయ్యొచ్చు. ఐతే ఇందులో Personalized choices అనే ఒక సౌకర్యం వలన దిద్దుబాట్లని గుర్తుపెట్టుకోగలదు. అంటే దీనికి కాస్త training ఇస్తే ఇది విజ్రుమ్భించి పని చేస్తుంది. దీనిలో ఉన్న ఒకే ఒక్క లోపం ఏంటంటే english లోకి మారడానికి ctrl-g నోక్కల్సి ఉంటుంది. ఇది కొంత మందికి అసౌకర్యం గా అనిపించవచ్చు. telugu script రాని కొందరిని అతి త్వరగా నేర్చుకోమని ప్రోత్సహిస్తున్నాను. google లోని తెలుగు వారి అండతో విడుదలైన ఈ transliteration tool ని దైనందిన జీవితం లో వాడడం షురూ చేయండి. ఈ మాత్రం చేయగలిగితే మీరు తెలుగు భాషకి చెప్పలేని మేలు చేసిన వారు అవుతారు.

Nageshwara Rao tells me that the IME tool by Microsoft is far better. You can check it out here.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s