‘దాన వీర శూర కర్ణ’ – సుయోధనుని వాక్యావళి

ద్రోణుడు: నీ కులము ?

కర్ణుడు: నేను సూతుడను; సూత కులము. 

ద్రోణుడు: సూతకుల సంజాతులు పూతకుల సంజాతులతో ఎదిరి నిలువ అనర్హులు

సుయోధనుడు: ఆగాగు. ఆచార్య దేవా! ఏమంటివి ఏమంటివి, జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువా ? ఎంతమాట, ఎంతమాట! ఇది క్షాత్ర పరీక్షయే గానీ క్షత్రియ పరీక్ష కాదే; కాదు కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా; నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది; మట్టి కుండలో పుట్టితివి కదా, నీది కులమో? ఇంత ఏల? అస్మత్పితామహుడు, కురుకుల వృద్ధుడు అయిన శాంథనవుడు శివ సముద్రుల భార్యయగు గంగా గర్భమున జనియించలేదా? ఈయనదే కులమో? నాతో చెప్పింతువేమయ్యా ? మా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవ వేశ్య యగు ఊర్వశీ పుత్రుడు కాడా ? ఆతడు పంచమ జాతి కన్యయైన అరుంధతి యందు శక్తిని, శక్తి చండాలంగన యందు పరాశరుని, పరాశరుడు పల్లె పడుచైన మత్స్య గంధి యందు మా తాత వ్యాసుని, వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చరుడని మీచే కీర్తించబడుతున్న విదుర దేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్ర, బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కుల హీనమైనది. కాగా నేడు కులము కులము అని వ్యర్థ వాదమెందులకు ? 

భీష్ముడు: నాయన, సుయోధనా! 

సుయోధనుడు: తాతా! 

భీష్ముడు: ఏరులా పారు బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినవి కావు. (సు: హహ్హహహ్హ!) ఇది నీవన్నట్లు ముమ్మాటికి క్షాత్ర పరీక్షయే. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యమున్న వారే రాజులు. అట్టి రాజులే కురురాజ పరిషత్తులో పాల్గొనుటకు అర్హులు. 

సుయోధనుడు: ఓహో, రాచరికమా అర్హతను నిర్ణయించునది ? అయిన, మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద విరాళమై వెలుగొందు అంగరాజ్యమునకిప్పుడే ఈతనిని మూర్తాభిషిక్తుణ్ణి గావించుచున్నాను. సోదరా దుశ్శాసన! అనర్ఘ నవర్త్న ప్రశస్త కిరీటమును వేగముగ తెమ్ము; మామా గాంధార సార్వభౌమా! సురుచిరమణిమయమండిత సువర్ణ సింహాసనమును తెప్పింపుము; పరిజనులారా! పుణ్యభాఘీరథీ నదీ తొయములనందుకొనుడు; కళ్యాణభద్రులారా! మంగళ తూర్యరవములు సుస్వరముగ మ్రోగనిండు; వందిమాగధులారా! కర్ణ మహారాజుకు కైవారమును కావింపుడు; పుణ్యాంగనలారా! రాధాసుతునకు ఫాలభాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది, బహుజన్మసుకృతప్రదీపాజసౌలబ్ధ సహజకవచకస్యవైఢూర్యప్రభాదిత్యోళికి వాంఛలు చెలరేగ వీర గంధము విజాలార్పుడు. నేనీ సకల మహజన సమక్షమున, పండిత పరిషన్మధ్యమున సదా, సర్వదా, శతథా, సహస్రథా కులకళంకమహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళణ గావించెదను. 

కర్ణుడు: దాతా! నా రక్తము రంగరించి అలకులుశాది రేఖాచిగురితములైన మీ అరుణారుణ శుభపాదపద్మయుగళమునకు సౌలేపమను గావించినను మీ ఋణమీగువాడను కాను. ఏచ్చటా శిరసొగ్గని రాధేయుడు తమ సర్వసమతా ధర్మోద్ధరణకు దాసానుదాసుడు. కర్ణుని తుది రక్తపు బిందువు మీ యశోరక్షణకు, మీ సార్వభౌమత్వ పరిరక్షణకు అంకితం కాగలదు. యావజ్జీవము, అహర్నిశము, హితుడనై, మీకు విశ్వాసబద్ధుడనై ప్రవర్తింతునని సర్వసామంత మహీపాల మండలాధిపతులు, సమస్త ప్రజానీకములు విచ్చేసిన సభామధ్యమున శపథము గావించుచున్నాను. 

సుయోధనుడు: హితుడా! అప్రతిహత వీరవరేణ్యుడవగు నీకు అంగరాజ్యమే కాదు, నా అర్ధసింహాసనార్హత నిచ్చి గౌరవించుచున్నాను. 

Advertisements

3 responses to “‘దాన వీర శూర కర్ణ’ – సుయోధనుని వాక్యావళి

 1. vijay krishna

  Thank you…..great job man…….

 2. Just one clarification…. adi ” sarvada sarvada shatada sahasrada”……anukunta……

 3. jagamerigina ntr dialogues ki comment avasaram ledu kada!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s